JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:22 pm Posted by : JANA SANGARSHANA

ఇల్లందు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

 

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు  ఫిబ్రవరి 26 ( జన సంఘర్షణ )

ఇల్లందు పట్టణంలోని ఇల్లందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. గురువారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గడ్డం వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా బండి రామారావు (iNews) ఎంపికయ్యారు. సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో వారు ఎన్నిక కావడం విశేషం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు మరియు కార్యదర్శికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యుల ఐక్యతతో పత్రికారంగ గౌరవాన్ని మరింత పెంపొందిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బండి రామారావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, శిక్షణా కార్యక్రమాలు, సంక్షేమ చర్యలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంగం వేణుగోపాల్, గుడివాడ శ్రీనివాస్, దుద్దుకూరి సుమంత్, మాదాసు నర్సి, కసోజుల రాజు, ఎల్. శ్రీనివాస్, దేవిరెడ్డి సువర్ణపాక శోభన్ బాబు, తంగల్లపల్లి శ్రీనివాస్ చారి, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రెస్ క్లబ్ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగాలని ఆకాంక్షించారు.

ఇల్లందు ప్రాంతంలో పత్రికారంగానికి విశిష్ట గుర్తింపు తీసుకురావడంలో ఈ నూతన కమిటీ కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.