JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 8:06 pm Posted by : JANA SANGARSHANA

ఊటుపల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. 

 

బోధన్ : ఫిబ్రవరి 25

జన సంఘర్షణ

బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం గ్రామస్తులు బుధవారం రోజున నిర్వహించారు. సోమవారం ఉదయం పోచమ్మ విగ్రహ ఊరేగింపు, అలాగే హోమము, అన్నదానం తదితర తదితర గ్రామస్తులు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ…. గ్రామంలో పాత పోచమ్మ సిమెంటు విగ్రహంతో ఉండడంతోపాటు వాటి స్థానంలో కొత్త నూతన రాతి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం నిర్వహించామని గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఆడపడుచులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.