JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:29 pm Posted by : JANA SANGARSHANA

ఖమ్మంలో కేటీఆర్ తో దిండిగాల భేటి

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు ప్రతినిధి. ఫిబ్రవరి 26 ( జన సంఘర్షణ)

భూదాన్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన కేటీఆర్ ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండిడిగాల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా భూదాన్ భూముల సమస్యలతో పాటు పేద వర్గాల ఇళ్ల కూల్చివేతల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల పేద ప్రజలు సంవత్సరాలుగా నివసిస్తున్న ఇళ్లను అకస్మాత్తుగా కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

దిండిడిగాల రాజేందర్ మాట్లాడుతూ… భూదాన్ భూములు కేటాయించిన పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూమి హక్కులు ఇవ్వకుండా, ఇళ్లు కూల్చడం ద్వారా పేదల జీవనాధారాన్ని దెబ్బతీయడం సరికాదని విమర్శించారు.

ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ, బాధితుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి చట్టపరమైన మార్గాల్లో న్యాయం జరిగేలా పార్టీ తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. పేదల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధితులకు పూర్తి మద్దతు ప్రకటించారు.