JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 10:56 pm Posted by : JANA SANGARSHANA

తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించలి

తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి , ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు గారి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.  తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తో పాటు కమిషన్ సభ్యులు తెలంగాణ విద్యా విధానంపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి కి సమర్పించారు. అమెరికా, వియత్నాం, మలేసియా వంటి దేశాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కి నివేదికలోని అంశాలను సుదీర్ఘంగా వివరించారు. నివేదికలోని అంశాలను తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి  పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , డాక్టర్ కె కేశవరావు , సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి  సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి , ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి , ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి  విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.