హైదరాబాద్ బ్యూరో/ ఫిబ్రవరి 26
( జనసంఘర్షణ )
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టి ఆర్ వి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మున్నా మాట్లాడుతూ, దివ్యాంగులకు సమాన అవకాశాలు మరియు గౌరవప్రదమైన జీవనం కల్పించినప్పుడే నిజమైన సమాజ వికాసం సాధ్యమవుతుంది.దివ్యాంగుల జీవితాలు ఇప్పటికీ అనేక అడ్డంకులు, వివక్షలు, అవమానాలతో నిండిపోయి ఉన్నాయనియి. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, ప్రభుత్వ కార్యాలయాల నుండి న్యాయస్థానాల వరకు అనేక చోట్ల అనుమానంతో, తక్కువ చూపుతో వ్యవహరించడం ఒక వ్యవస్థాగత వివక్షగా మారింది.చట్టం ఉన్నా అమలులో లోపాలు 2016లో అమలులోకి వచ్చిన రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసాబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం దివ్యాంగులను దయార్హులుగా కాకుండా సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించినప్పటికీ, గ్రామాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి.దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, ఫైళ్లను పక్కన పెట్టడం, పదేపదే కార్యాలయాలకు తిరగమంటూ మానసిక వేధింపులకు గురిచేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, బదిలీలలో వివక్ష చూపడం కూడా చట్టానికి వ్యతిరేకం.ఆస్తుల రక్షణలో ఆందోళనకర పరిస్థితి దివ్యాంగుల భూములను అక్రమంగా ఆక్రమించడం, బెదిరింపులు చేయడం, రాజీకి ఒత్తిడి చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇటువంటి కేసుల్లో వెంటనే పోలీసు ఫిర్యాదులు నమోదు చేసి, వేగవంతమైన విచారణ జరపవలసిన భాద్యత ఎంతైనా ఉన్నది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు ప్రభుత్వ కార్యాలయాల్లో రాంపులు, లిఫ్టులు, సౌకర్యవంతమైన మరుగుదొడ్ల లేమి విద్యాసంస్థల్లో సమగ్ర విద్య అమలులో లోపం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కొరత, పెన్షన్ల మంజూరులో ఆలస్యం, వైద్య పరికరాలు, సహాయక ఉపకరణాల కొరత ,గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి ,దివ్యాంగ మహిళలపై ద్విగుణ వివక్ష ,ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ,ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక దివ్యాంగ హక్కుల పరిరక్షణ సెల్ ఏర్పాటు , అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి సౌకర్యాలపై కఠిన పర్యవేక్షణ ,ఫిర్యాదులపై 30 రోజుల్లో పరిష్కారం విధానం , భూమి ఆక్రమణ కేసుల్లో వేగవంతమైన న్యాయ ప్రక్రియ , ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు పర్యవేక్షణ, పోలీసు, రెవిన్యూ, న్యాయ వ్యవస్థ అధికారులకు ప్రత్యేక శిక్షణవడ్డీ రహిత రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబన
చట్టాలు ఉండటం గర్వకారణమే కానీ అవి బాధితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. దివ్యాంగులను సహాయం కోరే వ్యక్తులుగా కాకుండా హక్కులు డిమాండ్ చేసే పౌరులుగా గుర్తించినప్పుడే నిజమైన సమానత్వం సాకారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి – టిఆర్విఎస్ స్పష్టం చేస్తుంది. దివ్యాంగులపై వివక్ష చూపే ప్రతి వ్యక్తి శిక్షకు గురయ్యే రోజు వచ్చినప్పుడే సమానత్వం నిజంగా అమలు అవుతుందన్నారు.