JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 10:40 pm Posted by : JANA SANGARSHANA

నేను అనుకున్నా…. నేనున్నా నీకు

హైదరాబాద్ ప్రతినిధి అంజిబాబు,

ఫిబ్రవరి 25, ( జన సంఘర్షణ ):

నేను అనుకున్నా…

మనం పున్నమిరాత్రి చకోరపక్షుల జంటై వెన్నెలను తాగుదాం అని.

కాని నువ్వైతే తాగావు. నన్ను వెన్నెలను చేశావు.

నేను అనుకున్నా మనం ఒకే కొమ్మపై వాలిన జంట పక్షులమని,

కాని నువ్వు ఎగిరిపోయావు. నన్ను మాత్రం, అదే చెట్టుపై కొమ్మను చేసావు

నేను అనుకున్నా మనం ‘ఇద్దరం ఒకే గమ్యం చేరాల్సిన బాటసారులమని,

కాని నువ్వు గమ్యం చేరుకున్నావు.

నన్ను మాత్రం దారిని చేశావు”నిజమే…

నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను…!!

కానీ గుర్తుంచుకో,

నువ్వు చేరిన గమ్యానికి పునాది నేనే,

నువ్వు తాగిన వెన్నెలకు మూలం నేనే…!!

-జి.శివకుమార్

(మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం)(సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం)