JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:02 pm Posted by : JANA SANGARSHANA

పెగడపల్లిలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

బోధన్ :ఫిబ్రవరి 25

జన సంఘర్షణ

బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని 9వ వార్డులో ఎంజిఎన్ఆర్ఆజిఎస్ నిధులతో సుమారు రూ.5 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పీసీసీ డెలిగేట్ గంగ శంకర్, సర్పంచ్ మద్దిరచన సుదర్శన్, ఉప సర్పంచ్ మహమ్మద్ షబ్బీర్, వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.