– ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
– భైంసాలో రైతులకు సబ్సిడీతో ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ.
భైంసా: ఫిబ్రవరి 27(జన సంఘర్షణ)
భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ ఫ్యాక్టరీలో సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకానైజేషన్ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మిర్జాపూర్ గ్రామానికి చెందిన పంచగూడి రాణి, గజ్జి గారి గంగామణి, వాలేగాం గ్రామానికి చెందిన జ్యోతి, వానల్‌పాడ్ గ్రామానికి చెందిన శకుంతల బాయి లకు రోటవేటర్లు అందజేయగా, కోతల్ గావ్‌కు చెందిన సాయినాథ్ రావుకు పవర్ రీడర్‌ను అందించారు. అదేవిధంగా స్ప్రే పంపులు, రోటవేటర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం గ్రామీణ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యగా స్థానికులు అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మికుల కొరత వంటి సమస్యల నేపథ్యంలో స్ప్రే పంపులు, రోటవేటర్ల వంటి పరికరాలు రైతులకు సమయంతో పాటు ఖర్చు తగ్గింపులో సహాయపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇటువంటి పథకాలు సక్రమంగా అమలు అయితే చిన్న, మధ్య తరహా రైతుల ఉత్పాదకత పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. పరికరాల పంపిణీతో పాటు వాటి వినియోగంపై శిక్షణ, సాంకేతిక సహాయం కూడా అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.