JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 1:09 pm Posted by : JANA SANGARSHANA

కొత్త పార్టీ ప్రకటనకు కవిత ముహూర్తం ఫిక్స్!

కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!తెలంగాణ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.ఏప్రిల్ 24, 25 తేదీల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితకు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో కీలక నేతలు ఆమె పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కవితతో టచ్ లోకి వచ్చినట్లు టాక్. ఈ సందర్భంగా వారి చేరికతో పాటు పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు ప్రకటించేందుకు ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక మే నెలలోపార్టీ ప్రకటన ఉంటుందని కవిత ఇప్పటికే చెప్పారు.