JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 7:51 pm Posted by : JANA SANGARSHANA

చికిత్సల పేరుతో భారీగా వసూలు ..

ఆర్,ఎమ్,పీ.. డాక్టర్లు ఆగడాలు అంత చిక్కడం లేదు

బోధన్ డివిజన్ లో ఈ మధ్యకాలంలో ఓ ఆర్,ఎమ్,పీ డాక్టర్ అవతారం ఎత్తి ఓ మనిషికి కుట్లు వేశారు. కుట్లు వేయడానికి సుమారు 1200 నుంచి సుమారు 2000 రూపాయల వరకు వసూలు చేసినట్టు ప్రజలు బోగట్ట, అర్హత లేని వైద్యులు కుట్లు వేసుకుంటూ కోర్సులు చదువుకున్న డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ చేస్తూ బాగానే వసూలు చేస్తూ ప్రజల పట్ల వసూళ్ల రాజాగా మారుతున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఫ్రీగా అవుతుంది కానీ అర్హత లేని ఆర్,ఎమ్,పీ అవసరం ఎత్తి భారీగా వసూలు చేస్తూ ప్రజలను ముక్కుపిండిగా ఇబ్బంది పాలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు చేయవచ్చు కానీ వైద్యులు చేసే చికిత్సలు మితిమీరి చికిత్సలు చేసి దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల వద్దకే మేము వస్తున్నాం అంటూ చెబుతూ ఇళ్లల్లోకి వెళ్లి చికిత్సల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఒక మండలం కాకుండా సుమారు అనేకచోట్ల ఇదే కొనసాగుతుందని అయితే ఈ విషయంకు ఫోన్లో జిల్లా వైద్య శాఖ అధికారికి వివరణ కోరగా జిల్లా వైద్య శాఖ అధికారి ఆఫీస్ లో వచ్చి ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.