జాతీయ లోక అదాలత్ లో 5662 కేసులో పరిష్కారం.
– పోలీస్ కమీషనర్ వెల్లడి.
– సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 31,82,649-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేత.
– పెండింగ్ లో ఉన్న ఐ.పి.సి & బిఎన్ఎస్ & ఎస్.ఎల్.ఎల్ 621 కేసులు, సైబర్ క్రైమ్ 134 కేసులు ,ఇ-పెట్టి 2190 కేసులు , డి.డి & ఎమ్ వి యాక్ట్ 2717 మొత్తం 5662 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను , సిబ్బందిని అభినందించిన నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపిఎస్.గత నెల రోజుల నుండి శని వారం రోజున 28 వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా , జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఐ.పి.సి & బిఎన్ఎస్ & ఎస్.ఎల్.ఎల్ 621 కేసులు, సైబర్ క్రైమ్ 134 కేసులు ,ఇ-పెట్టి 2190 కేసులు , డి.డి & ఎమ్ వి యాక్ట్ 2717 మొత్తం 5662 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ…. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్ మరియు వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది మరియు కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని , అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని , డీఎస్సీ ,ఎస్ బి, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఐ.పి.ఎస్., ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డీ4సి ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 134 సైబర్ క్రైమ్ కేసులలో 31,82,649-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపి వై. వెంకటేశ్వర్ రావ్ , సీఐ ముఖిద్ పాషా , సిసిఆర్బి సీఐ అంజయ్య , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ , అభినందించారు.