JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 10:10 pm Posted by : JANA SANGARSHANA NEWS

తరుణ్ కు నివాళులు…

బోధన్ . మార్చ్ 13. (జన సంఘర్షణ ) ; హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందూరు నగరంలోని శివాజీ నాందేడ్ వాడ శివాజీ చౌక్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో హత్య చేయబడ్డ తరుణ్ కు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ హోలీ పండుగ రోజు అనుకోకుండా కొద్దిగా కలర్ పడ్డందుకు తరుణ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపడం చాలా బాధాకరం అని అన్నారు ఈ మధ్య నిరంతరంగా హిందువులపై దాడులు చేస్తూ జీహది గాళ్లు హిందువులని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు మోస్రా గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సౌమ్య అనే అమ్మాయిని కూడా జిహాదీ గంజాయి స్మగ్లర్లు నిర్దాక్షిణ్యంగా యాక్సిడెంట్ చేసి చంపేశారు అలాగే ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని కూడా కత్తితో పొడిచి చంపేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతో మందిని హిందువులపై గోరాతి ఘోరంగా దాడులు చేస్తూ చంపేస్తున్న ఈ జిహాదీకాళ్లపై ప్రభుత్వాలు కఠిన చర్య తీసుకోవాలి హిందువులు జాగృతం కావాలి హిందూ యువకులందరూ కూడా జాగృతం అయి ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ జలిగం గోపాల్ బంటురామరాజు బోత్ కిషన్ పిట్ల స్వామి రాహుల్ అరవింద్ మురారి బినయ్ సంజీవ్ పురోహిత్ మరియు వంద మంది యువకులు పాల్గొన్నారు.