తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరిక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. UG – CBCS II, IV, VI సెమిస్టర్ రెగ్యులర్ మరియు I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష లకు సంబంధించిన ఫీ నోటిఫికేషన్ విడుదలైనదని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె . సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని తర్వాత అపరాధ రుసుముతో చెల్లించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచినట్లు ఆయన పేర్కొన్నారు.