నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ప్రాంతాలలో గల రంజాన్ మాసంలోని జగ్నెకి రాత్సం దర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, నిజామాబాదు పట్టణంలోని మసీద్‌లను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రార్థనలకువచ్చిన ముస్లిం సోదరులలతో మాట్లాడారు…ప్రశాంతంగా నమాజ్ నిర్వహించుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు పరిశీలించి పోలీస్ అధికారులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు.
మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి , రాత్రి సమయంలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ , ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
పండుగల సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో శాంతి , సామరస్య వాతావరణాన్ని కాపాడాలని పోలీస్ కమీషనర్ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది.