JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 4:59 pm Posted by : JANA SANGARSHANA

పదవి విరమణ చేసిన  సిబ్బందికి వీడ్కోళ్ళు 

 

నిజామాబాద్ పోలీస్ శాఖలో మార్చి 31 న  వదవి విరమణ నేపద్యంలోని మార్చ్ నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరములు

పి. శ్రీనివాస్ , ఎస్టాబ్లిష్మెంట్ సూపర్డెంట్ (ఎ), సి.పి.ఓ ఆఫీస్ నిజామాబాద్ మొత్తం సర్వీస్ 39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ పొందినారు.

పీ.రవీందర్, సి.సి.ఎస్, ఇన్స్పెక్టర్ నిజామాబాద్ మొత్తం సర్వీసు పోలీస్ శాఖలో (43) సంవత్సరాలు పూర్తి చేసి నేడు పదవి విరమణ పొందినారు.

టి. శ్యాం కుమార్ ఎస్సై వి.ఆర్- నిజామాబాద్ అటాచ్మెంట్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ పోలీస్ శాఖలో ( 43 ) సం|| ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ” పొందినారు.

ఆర్.గంగారం, ఎ.ఎస్.ఐ నిజామాబాద్ టౌన్ నాలుగు వ పోలీస్ శాఖలు (37) సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి నేడు పదవీ విరమణ పొందినారు.

డి.ప్రభాకర్ ,హెడ్ కానిస్టేబుల్ -1494 మహిళా పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పోలీస్ శాఖలో (35) సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి నేడు పదవీ విరమణ పొందినారు.

మంగళవారం రోజున మధ్యాహ్నం పదవి విరమణ” వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ సూచించారు. వీరికి శాలువలతో సత్కరించి” పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు ( జ్ఞాపికలతో ) ” ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, మాట్లాడుతూ… పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళలసహయపడుతామని , మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.

ఈ వీడ్కోళ్లు సందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వా రెడ్డి , ఎ.ఓ, ఆసియా బేగం , ఆఫీస్ సూపర్డెంట్లు శ్రీ శంకర్ , శ్రీ బషీర్ అహ్మద్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , శ్రీధర్ రెడ్డి , రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎం.టీ.ఓ) ఎస్. శేఖర్ బాబు , సతీష్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి శ్రీలత , టౌన్-IV , పి ఎస్ , ఎస్.హెచ్.ఓ శ్రీ సతీష్ కుమార్ , మరియు పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హజరుకావడం జరిగింది.