JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 10:37 am Posted by : JANA SANGARSHANA

ప్రతి వినియోగదారునికి గ్యాస్ అందిస్తాం…

ప్రతి వినియోగదారునికి గ్యాస్ అందిస్తాం…

హెచ్.పీ.దీక్షిత్ గ్యాస్ యజమాని ఆదినారాయణ.

బోధన్ :మార్చి :16

ప్రతి వినియోగదారునికి తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అందిస్తామని హెచ్.పీ దీక్షిత్ గ్యాస్ యజమాని ఆదినారాయణ సోమవారం ఉదయం పేర్కొన్నారు. గ్యాస్ కోసం వచ్చే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. గత పదేళ్ల నుండి ఏజెన్సీ కి రోజుకి ఒక గ్యాస్ బండి వస్తుందని, అందులో 504 సిలిండర్లు మాత్రమే వస్తాయని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం రోజుకు 2000నుండి 3000 మంది వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. గ్యాస్ బుక్ చేయకుండా సిలిండర్ అయిపోయిందని, గ్యాస్ కావాలని మేమేలా ఇస్తామన్నారు. బుక్ చేసిన తర్వాత ఓటిపి వస్తే ఓటీపీ నెంబర్ పట్టుకొని బుక్ తీసుకొని వస్తే మీకు సిలిండర్ తప్పనిసరిగా ఇస్తామని తెలిపారు. గ్యాస్ వాహనాలు గల్లీలోకే, ఊర్లోకి వస్తున్నాయని వినియోగదారులు అక్కడే తీసుకోవాలని సూచించారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఓటిపి ఉన్న వాళ్లకు గ్యాస్ ఎటువంటి కొరతలేదన్నారు. దయచేసి పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు గ్యాస్ దొరకదు అని అపోహ మరిచిపొండని, తప్పనిసరిగా గ్యాస్ అందజేస్తామన్నారు. ఎవరు చెప్పిన మాటలు వినకూడదని మీరు గ్యాస్ బుక్ చేసిన ఓటీపీ నంబర్ ఉంటే మీకు తప్పనిసరిగా గ్యాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దీక్షిత్ గ్యాస్ యజమాని ఆదినారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.