JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 10:17 pm Posted by : JANA SANGARSHANA

బోధన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ సిపి

 

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ జామ మసీద్‌లో బుధవారం రాత్రి మజీద్ కమిటీ అధ్యక్షుడు గుల్షని ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానిక నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి జావేద్ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి బోధన్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్ ,సీఐలు వెంకటనారాయణ, విజయబాబు, కృష్ణ , ఎస్సై హబీబ్, మజీద్ కమిటీ సభ్యులు మహబూబ్ గుల్ షాని ,  సయ్యద్ జాకీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.