భారతదేశ అదనపు సోలిసిటర్ జనరల్, పార్లమెంట్ మాజీ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ శనివారం ఉదయం 11 గంటలకు బోధన్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, న్యాయవాదుల సమస్యలను కేంద్ర న్యాయశాఖ సమావేశంలో చర్చించి అమలు కోసం ప్రయత్నం చేస్తానని న్యాయవాదులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షులు బి. రాములు, ఉపాధ్యక్షులు విఆర్ దేశాయ్, ప్రభుత్వ అదనపు న్యాయవాది గౌసుద్దీన్, ప్రభుత్వ సహ న్యాయవాది బొగ్గుల రవీందర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎం గంగారెడ్డి, సి హెచ్ వి హనుమంతరావు, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, నంద కుమార్, ఫోశెట్టి , నరేష్ కులకర్ణి, దత్తాత్రేయ కులకర్ణి, మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.