మంజూరైన ఇళ్ళ పట్టాలు వెంటనే పేదలకు అందించాలని ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి.
హైదరాబాద్: మార్చి 04
జన సంఘర్షణ
ధీనగర్ డివిజన్, శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీ వాసులకు మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు వెంటనే అందచేయాలని జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ని కోరారు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మంగళవారం ఉదయం బస్తీ వాసులతో కలిసి మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. మంజురైన పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాల పై చర్చించారు.సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,… రాజ్య సభ ఎం పి డా”కె లక్ష్మణ్ తో పట్టాల పంపిణీ గురించి ఫోన్ లో చర్చించినట్లు తెలిపారు, ఈ వారంరోజుల్లో బాధితులకు అధికారుల సమక్షంలో తామే స్వయంగా ఇళ్ళ పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వినయ్ కుమార్ తెలిపారు.కార్యక్రమంలో బస్తివాసులు ఎం. బి.కృష్ణ,జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు పలువురు వున్నారు.