మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలను సందర్శించిన -బోధన్ సబ్ కలెక్టరేట్
బోధన్ సబ్-కలెక్టర్ వర్ని తహసీల్దార్ తో వర్ని మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించారు. బోధన మరియు బోధనేతర సిబ్బంది హాజరు నిర్ధారించేందుకు హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వసతులను విద్యార్థుల విద్యా స్థాయిని ప్రశ్నలు అడిగి అంచనా వేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాల మొత్తం పనితీరు మరియు వసతులను సమీక్షించారు. విద్యార్థులలో హెచ్ పి వి, వ్యాక్సిన్ అమలు స్థితిని సమీక్షించి, దీని ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టారు. టీకా కార్యక్రమాలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆరోగ్య అధికారులతో సమన్వయం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సానిటరీ ప్యాడ్లు లభ్యత గురించి విచారించి, అవి అందుబాటులో లేవని గమనించారు.మరుగుదొడ్ల సంఖ్య తగినంతగా లేవని గుర్తించారు.సరైన ప్రమాణాలు పాటిస్తూ, విద్యార్థుల సంక్షేమాన్ని నిర్ధారించేందుకు అవసరమైన సూచనలు జారీ చేశారు.