JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 12:47 pm Posted by : JANA SANGARSHANA

ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్.

 

ముగ్గురు కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చెరువులోకి తోసి హత్య చేసిన తండ్రిని రిమాండ్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్: ఏఎస్పీ చైతన్య రెడ్డి

ముగ్గురు కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చెరువులోకి తోసి హత్య చేసిన తండ్రిని రిమాండ్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆర్బీ నగర్కు చెందిన చిన్నారులు మరొక ఇద్దరిని కేసును ఛేదిస్తాం.. ఆర్బీ నగర్ కు చిన్నారులు ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదని శనివారం పోలీసులకు ఫిర్యాదు అందిందని ఏఎస్పీ తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టామన్నారు. పిల్లలను ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో తండ్రి చెప్పిన ప్రకారం సీసీ పుటేజీలను పరిశీలించగా అలాంటి ఆధారాలు ఏమీ లభించలేవని తెలిపారు. అక్కడ ఇక్కడ అంటూ తిప్పుతున్న తండ్రిపై అనుమానం వచ్చి విచారించగా చెరువు వద్దకు తీసుకెళ్లి చెరువులో తోసేసినట్లు చెప్పాడని తెలిపారు. అప్పుల భారం, ముగ్గురు కూతుళ్లను పోషించలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామని, కస్టడీకి తీసుకుని పూర్తి విచారణ చేపడతామని పేర్కొన్నారు.

మరొక ఇద్దరిని కేసును ఛేదిస్తాం..

కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు బాలురను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ నెల 6న పిల్లలు అదృశ్యమైనట్టు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. పిల్లలు రోజు ఎక్కడెక్కడికి వెళ్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ ఇద్దరిని కూడా పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్ పాల్గొన్నారు.