JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 3:13 pm Posted by : JANA SANGARSHANA

యూనివర్సిటీ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపకులపతి

 

 

వర్సిటీ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపకులపతి తెలంగాణ యూనివర్సిటీకి చెంది హాస్టళ్లను వైస్ చాన్సలర్ ప్రొ. యాదగిరి రావు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా, స్వయంగా భోజనం చేసి పరిశీలించడం ద్వారా ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా అంచనా వేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైస్ చాన్సలర్, హాస్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం నిరంతరం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. యూనివర్సిటీ విద్యార్థుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో రిజిస్ట్రార్ యాదగిరి , చీఫ్ వార్డెన్ రవీందర్ వార్డెన్లు డా. గంగాకిషన్, కిరణ్ రాథోడ్ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (COE) సంపత్ , ప్రిన్సిపాల్ రాంబాబు  పాల్గొన్నారు.