JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:21 am Posted by : JANA SANGARSHANA

రుద్రూర్ గ్రామంలో లో విషాదఛాయలు 

రుద్రూర్ . ఫిబ్రవరి 28 (జన సంఘర్షణ)

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన జయదేవ్, ప్రసన్న తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వీరి ఉన్నత చదువుల కోసం జయదేవ్ దంపతులు హైదరాబాద్లో గత కొన్ని నెలల నుంచి ఉంటున్నారు. రుద్రూర్ ఆహార పరిశోధన కేంద్రంలో డిప్లమో పూర్తి చేసిన జయదేవ్ కుమార్తె గౌతమి,  హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. విధులు నిర్వహించడానికి గత ఏడాది డిసెంబర్ 23న స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాలకు గురైంది. ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు నెలలపాటు మెరుగైన వైద్యం అందించారు. అయినప్పటికీ గౌతమి ఆరోగ్యం రోజురోజుకు విషమించడంతో శనివారం ఉదయం హైదరాబాదులో కన్ను మూసింది. తీవ్ర గాయాలు కు గురైన గౌతమి మృతి చెందడంతో ఉన్న ఏకైక కుమార్తె కనిపించని లోకానికి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రులు జయదేవ్, ప్రసన్న కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక తన కూతురు కనిపించదు అన్న విషయాన్ని తెలుసుకొని జీర్ణించుకోలేక పోతున్నారు. ఉన్నత చదువులు చదివించడానికి రుద్రూర్ నుంచి హైదరాబాద్కు వచ్చి తన కూతుర్ని కోల్పోవడం పట్ల గౌతమి తల్లిదండ్రుల రోదన రుద్రూర్ గ్రామంలో ని ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గ్రామంలో పూర్తిగా విషాదశాయలు అమలుకున్నాయి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పాలై చికిత్సపొందుతూ రెండు నెలల తర్వాత మృతి చెందడం పట్ల ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రుద్రూర్l లొ విషాదఛాయలు అలు ముకున్నాయి.