JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:58 pm Posted by : JANA SANGARSHANA

రుద్రూర్ మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాదం

రుద్రూర్ మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారి మంగళవారం ఉదయం 11 : 15 నిమిషాల సమయంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె.ఎం.సీ కాలనీ వద్ద లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టీజీ 16 జెడ్ 0102 నంబరు ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ నెంబర్ టీఎస్ 22 టి 3348 గల లారీని అతివేగంగా బస్సు ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి.

హుటాహుటిన  నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని రోడ్డు ప్రమాదంలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోడ్ స్టాపర్లు , రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జెసిబి సహాయంతో పక్కకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మెరుగైన వైద్య సేవల కోసము క్షతగాత్రులను నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఎసిపి  పి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ  విజయబాబు , రుద్రూర్ ఎస్సై  సాయన్న మరియు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు ఆర్టీసీ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు గలరు.