వర్ని మండలంలో ఛలో హైదరాబాద్ కార్య క్రమానికి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మండల అంగన్వాడీ అధ్యక్షురాలు మంగాదేవి ఈ విషయాన్ని తెలిపారు. సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని, అరెస్టులతో తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు.అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఓ పక్క నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచకపోవడాన్ని సిపిఎం పార్టీ తప్పుపడుతుంది వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం శ్రామిక మహిళలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ నవీపేట్ మండల కమిటీ సభ్యులకు పేర్కొన్నారు.