287 వ శ్రీ సేవలాల్ జయంతిని బోధన్ ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు.
బోధన్: మార్చి 08
జన సంఘర్షణ
బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి లో జర్నలిస్ట్ కాలనీ ముందర శ్రీ సేవాలాల్ 287 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి శ్రీ సేవాలాల్ చిత్రపటానికి మాల వేసి ఘనంగా ఆదివారం ఉదయం నిర్వహించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బంజారా పిల్లలు చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బంజారా కల్చర్ ప్రోగ్రాం ఆడిన వారిని తిలకించారు.
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు పిల్లల్ని బాగా చదివించి కలెక్టర్లు, ఎమ్మార్వోలుగా, స్థిరపడాలని అన్నారు. బాగా చదువుకొని రాణించిన వారికి సొంత ఖర్చులతో బట్టలు ఇస్తానని తెలిపారు. ఆరోగ్యపరంగా ఏ ప్రైవేట్ నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఆస్పత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సభా ముఖంగా తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రి వెళ్లకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్శ పద్మ రత్ రెడ్డి, ఆచన్పల్లి వార్డు లక్ష్మి, బోధన్ ఎమ్మార్వో విటల్ , రెంజల్ ఎమ్మార్వో , సాలూర ఎమ్మార్వో, ఎడపల్లి ఎమ్మార్వో, అడిషనల్ కలెక్టర్ , కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.