సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహం గురువారం రోజు ముంబైలో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, తన స్నేహితురాలు సానియా చందోక్‌ను మార్చి 5న ముంబైలో వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహానికి ముందు, జామ్‌నగర్‌లో ముకేశ్ అంబానీ దంపతులు ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా, తన కుమారుడు ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు తండ్రికి కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమవుతుందని, అర్జున్, సానియా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, తన కొడుకు తనకు నచ్చిన తోడును వెతుక్కున్నందుకు గర్వంగా ఉందని సచిన్ భావోద్వేగంగా మాట్లాడారు.