పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ డిమాండ్ ….
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల బందును నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే దీనిలో విద్యారంగానికి చాలా తక్కువ శాతం నిధులు కేటాయించడం జరిగింది.విద్యార్థి సంఘాలు,ఉపాధ్యాయ సంఘాలు,ప్రజాస్వామిక వాదులు బడ్జెట్లో విద్యకు కనీసం 20 శాతం నిధులు అయిన కేటాయించాలని తమ అభిప్రాయాలు తెలియజేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా 8% శాతం నిధులు మాత్రమే కేటాయించడం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయడమే. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విషయం మాట్లాడకుండా బకాయిలను పూర్తిగా విడుదల చేయకపోవడం ద్వారా మళ్లీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ,ఫార్మసీ,ఇంజనీరింగ్,పీజీ చదువుతున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాలుగా రాకపోవడం వలన విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులు తమ యొక్క సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మొత్తం ఫీజు చెల్లిస్తేనే మీయొక్క సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నా కనీసం ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సరైనది కాదని విద్యార్థుల సమస్యను గుర్తించి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ బాకాయలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ రాష్ట్ర నాయకులు ఎన్ కార్తీక్ జిల్లా కోశాధికారి కే సాయినాథ్ ,బలరాం ,వికాస్ , చక్రధర్, రవి తదితరులు పాల్గొన్నారు.