JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 9:12 pm Posted by : JANA SANGARSHANA

23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పెట్టుకున్న పోలీసులు

 

రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

భద్రాద్రి కొత్తగూడెం . మార్చ్ 06 .

జన సంఘర్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం, మాచినేనిపేట గ్రామానికి చెందిన ఘనప నరసింహారావు, మరియు జూలూరుపాడు చెందిన కోమ్మినేని నాగేశ్వరరావు, గత కొంత కాలం నుండి జూలూరుపాడు మండల పరిసర ప్రాంత లబ్ధిదారుల వద్ద నుండి తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, మాచినపేట గ్రామ శివారుణ గల నరసింహారావు కోళ్ల ఫారం అక్రమంగా నిలువ చేసుకొని, వాటిని అవసరమైన వారికి అమ్మి, ఎక్కువ మొత్తంలో లాభాలు గడిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రేషన్ బియ్యాన్ని కోళ్ల ఫారం డంపు చేసుకుని ఉన్నారనే సమాచారంపై , జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి, కోళ్ల ఫారం వద్దకు వెళ్లి 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనమును,ఒప్పో కంపెనీ సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకున్నారు. 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం విలువ 51 వేల రూపాయలుగా ఉంటుంది. ఇరువురిపై కేసు నమోదు చేయడం జరిగినది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.