బోధన్ పట్టణంలో శక్కర్ నగర్ లో హనుమాన్ స్వాముల మహాబిక్ష కార్యక్రమం లో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్, జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతుల శశిధర్ ఈ సందర్బంగా హనుమాన్ స్వాముల మాల ఆధ్యాత్మికత తో పాటు ధర్మం వైపు నడిపించే దిశగా ప్రేరణ ఇస్తుందని అన్నారు. బోధన్ చారిత్రాత్మక నగరమని, ఏకచక్ర పురమని, హైందవ సాంస్కృతిక వైభావానికి పేరు గాంచిందని, పాండవులు నడా యాడిన స్థలమని అన్నారు. అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… బోధన్ లోని వంద స్థంబాల నిర్మాణానికి స్వాముల సంకల్పం, ఆశీర్వాదం అవసరమాని, ఎన్ని ఆటంకాలైన వంద స్తంభాల గుడి నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమం లో 400 మంది హనుమాన్ స్వాములు వివిధ వర్గాల ప్రజలు న్యాయవాదులు పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, వి హెచ్ పి విభాగ్ కన్వినర్ కృష్ణ పాల్గొన్నారు.