JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:30 pm Posted by : JANA SANGARSHANA

ఇసుక టిప్పర్లను అడ్డగించిన నలుగురు వ్యక్తులు అరెస్టు

ఇసుక టిప్పర్లను అడ్డగించిన నలుగురు వ్యక్తులు అరెస్టు

బోధన్ :ఏప్రిల్ 23

జన సంఘర్షణ

డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తుల అరెస్ట్ రెండు ఆటోలు స్వాధీనం

బోధన్ పట్టణ పరిధిలోని బాబా గార్డెన్ సమీపంలో ఇసుక టిప్పర్లను అడ్డగించిన, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేయయం జరిగింది . వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నాము. నిందితులు వసీం ఖురేషీ, సయ్యద్ ఓవేస్, షేక్ అర్బజ్ మరియు షేక్ అల్మాస్ అనే నలుగురు వ్యక్తులు  ఈ నెల 22వ తేదీ సాయంత్రం సుమారు 04:30 గంటల సమయంలో, నిందితులు రెండు ఆటోలలో (TS16UD 0417 మరియు TG16T1362) బాబా గార్డెన్ వద్ద బైపాస్ రోడ్డు నుండి వస్తున్న ఇసుక టిప్పర్ (TG17T1314)ను వెంబడించి, అడ్డగించారు. డ్రైవర్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, నిందితులు రాళ్లతో టిప్పర్ అద్దాలను పగులగొట్టి, డ్రైవర్‌ను కొట్టి గాయపరిచారు.అదే సమయంలో వెనుక నుండి వచ్చిన మరో టిప్పర్ (TS08UD7179) డ్రైవర్ ఈ దాడిని తన ఫోన్‌లో వీడియో తీస్తుండగా, నిందితులు అతనిపై కూడా దాడి చేసి, ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి TS16UD 0417 (బజాజ్ ఆటో),TG16T1362 (బజాజ్ ఆటో) స్వాధీనం చేసుకున్నాము. వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, చట్టవిరుద్ధమైన వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.