JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 5:52 pm Posted by : JANA SANGARSHANA

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

బోధన్: ఏప్రిల్ 25 జన సంఘర్షణ

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్/ బ్యాక్ లాగ్ పరీక్షలు శని వారం రోజున ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట. చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7487 మంది అభ్యర్థులకు గాను 7199 మంది అభ్యర్థులు హాజరు కాగా 287 మంది గైర్హాజర్ అయ్యారని మరియు నిజామాబాద్ లోఒకరు డిబార్ అయ్యారని ఆయన తెలిపారు.ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష కు 4460 మంది విద్యార్థులకు గాను 4322 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షకు 3027 మందికి గాను 2877 మంది హాజరు కాగా 150 మంది గైర్ హాజరయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి ,ఆర్మూర్ లోని పలు పరీక్షా కేంద్రాలను అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట. చంద్ర శేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కె.సంపత్ కుమార్,అకడమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్. అతిక్ సుల్తాన్ లతో రెండు ప్రత్యేక బృందాలు గా ఏర్పడి పర్యవేక్షించారు.