JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 5:41 pm Posted by : JANA SANGARSHANA

ప్రజావాణి కార్యక్రమంలో 32 ఫిర్యాదులు స్వీకరించారు.

 

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి 32 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య,  తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు. వివిధ ఫిర్యాదు లకు సంబందించిన 32 ఫిర్యాదు లను స్వీకరించారు.