JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 4:33 pm Posted by : JANA SANGARSHANA

ప్రొఫెసర్ ఆంజనేయులు డాక్టర్ సుధాకర్ గౌడ్ లను ఘనంగా సన్మానించారు.

ప్రొఫెసర్ ఆంజనేయులు మరియు డాక్టర్ సుధాకర్ గౌడ్ లను ఘనంగా సన్మానించిన తూటా

తెలంగాణ యూనివర్సిటీ క్లాస్ – 2 పాలకమండలిలో ఇంటర్నల్ మెంబర్స్ గా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆంజనేయులు మరియు బికనూరు సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్. సుధాకర్ గౌడ్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం రోజున ప్రొఫెసర్ ఆంజనేయులు మరియు డాక్టర్ సుధాకర్ గౌడ్ లను తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ… యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. డాక్టర్. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ… యూనివర్సిటీ అభివృద్ధికి అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్బంగా వారు తమ నియామకానికి సహకరించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు మరియు రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి యు టి ఎ ప్రెసిడెంట్ డాక్టర్ పున్నయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ మోహన్ బాబు ట్రెజరర్ డాక్టర్ ఎ. నాగరాజు మరియు డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి డాక్టర్ శిరీష డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.