బోధన్ పట్టణంలోని ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం
బోధన్ : ఏప్రిల్ 18 జన సంఘర్షణ
బోధన్ పట్టణంలోని ఏ ఆర్ గార్డెన్ వద్ద శనివారం రోజున ఉదయం ప్రజాపాలనలో భాగంగా పట్టణంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. అచన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి ఏఆర్ గార్డెన్ వరకు గల ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) పరిశీలించి, వాహనదారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.