బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు మహానీయుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి. వేడుకలను శనివారం రోజున ఉదయం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య కోసం ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా విద్యా రంగంలో ఫూలే చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్, సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఫూలే కు నివాళులు అర్పించారు.