JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 5:12 pm Posted by : JANA SANGARSHANA

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత

– పోలీస్ కమిషనర్ వెల్లడి.

నిజామాబాద్ : ఏప్రిల్ 17జన సంఘర్షణ

అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై కార్పొరేటర్స్ కు మరియు గ్రామ సర్పంచ్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ

జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ మరియు గ్రామ సర్పంచులు లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాదు లోని శ్రీ రామ గార్డెన్స్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించారు. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ,

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని , ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తాము అని అన్నారు. నిజామాబాదు డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడటం జరిగంది ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన మాక్లూరు మండలం నికి చెందినటువంటి వ్యక్తి మరణించిన సందర్భంగా అతని కుటుంబంలో చాలా నిరుపేదగా ఉండటం వలన వారి కుటుంబ సభ్యురాలు ఆయన పుష్ప కు అప్పుడే జమ చేసిన డబ్బులను పోలీస్ కమిషనర్ చేతుల ద్వారా అందించారు.

ఆ తరువాత అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి , నిజామాబాదు ఇంచార్జి ఎసిపి శ్రీ రాజా వెంకట్ రెడ్డి , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శ్రీ చిన్న సాయిరెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , సిఐలు , ఎస్సైలు , , యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ శ్రీ పూర్ణేశ్వర్ , సైబర్ క్రైమ్ ఆర్. ఎస్. ఐ శ్రీ రవి , గ్రామ సర్పంచ్ లు , కార్పొరేటర్స్ , ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.