బిచ్కుంద రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అరెస్ట్
బోధన్ : ఏప్రిల్ 17 జన సంఘర్షణ
బిచ్కుంద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. కల్లు దుకాణాల తరలింపుపై ఒత్తిడి చేయకుండా, కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. అదనంగా ఆయన వద్ద రూ.45,760 నగదు లభించింది. ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండు తరలించారు.