42 ఏండ్ల అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయకలయిక..
బోధన్: ఏప్రిల్ 05 జన సంఘర్షణ
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1982-84వ సంవత్సరంలో ఇంటర్మీడియేట్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..42 ఏండ్ల అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయకలయిక..నాటి లెక్చరర్, రచయిత నాళేశ్వరం శంకర్ నాటి జ్ఞాపకాల నెమరు..బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 42 ఏండ్ల క్రితం విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఆదివారం హైదరాబాద్లో ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. నాడు విద్యార్ధి దశ నుంచి నేడు వారువారు చేస్తున్న ఉద్యోగాలు, వారి జీవిస్తున్న విధానాలపై వారిలో ఒకరైన ప్రముఖ వ్యాఖ్యాత, రేడియో అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు రోజుల పాటు ఒకరినొకరు కలుసుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. 1982-84వ సంవత్సరంలో కళాశాలలో తెలుగు లెక్చరర్గా విధులు నిర్వహించి నాళేశ్వరం శంకర్ను కూడా అక్కడకు మర్యాదపూర్వకంగా పిలిచి, ఆయనతో సరదాగా తమ జ్ఞాపకాలను, నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం ఐనంపూడి శ్రీలక్ష్మి గత వారం రోజులుగా వాట్సాప్ ద్వారా తోటి మిత్రులను ఒకటిగా చేసి, వారిని ఆత్మీయసమ్మేళనానికి ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం కవి, రచయిత, నాటి అధ్యాపకుడు నాళేశ్వరం శంకర్ను పూర్వ విద్యార్థుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో బి. శంకర్ రాజు, జీఎన్ స్వామి, పరుశురాం, శివకుమార్, మారుతీ, శివకుమార్, కిరన్, రవి, దేవేంధర్, హసన్తో పాటు మరికొంత మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ లక్ష్మికి తోటి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.