JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:37 pm Posted by : JANA SANGARSHANA

ఎల్లారెడ్డి ఎస్ఐగా రాజు బాధ్యత స్వీకారణ 

ఎల్లారెడ్డి ఎస్ఐగా రాజు బాధ్యత స్వీకారణ

ఎల్లారెడ్డి :మే 07 జన సంఘర్షణ

ఎల్లారెడ్డి ఎస్సైగా రాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై బొజ్జ మహేష్ రాజాంపేట్ మండలంకు బదిలీ కావడంతో, రాజంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజు బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికారు.