JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:27 pm Posted by : JANA SANGARSHANA

ఎస్ఐఆర్ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలి…

ఎస్ఐఆర్ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలి…

బోధన్ ఆర్డీఓ ఎం .విజయకుమారి

బోధన్ మే 19

ఎస్ఐఆర్ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని బోధన్ ఆర్డీఓ ఎం. విజయ కుమారి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బోధన్ తహశీల్దార్ పి.విఠల్ తో కలిసి, బోధన్ మండల బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఆర్ర్పిఓ సూపర్వైజర్ ల బృందంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ను బూత్ ల వారీగా పరిశీలించి, తక్కువ పురోగతి ఉన్న ప్రదేశాలలో ని బిఎల్ఓ ల తో తగు కారణాలపై చర్చించారు. సత్వరమే వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాల్సింది గా ఆదేశించారు. శనివారం లోపు, అన్ని బూత్ ల లో మాపింగ్ ప్రక్రియను 80శాతం కి పైగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.