JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:41 pm Posted by : JANA SANGARSHANA

ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

బోధన్ : మే 07జన సంఘర్షణ

గురువారం రోజున మధ్యాహ్నం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. వేసవికాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరంలో పలు కూడళ్ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించడానికి ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయించి కోర్ట్ సర్కిల్ వద్ద పోలీస్ కమిషనర్ గారు ప్రారంభించారు. కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి మిస్ట్ యంత్రాల పనితీరును ట్రాఫిక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్  మాట్లాడుతూ… సుమారుగా మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు మిస్టి యంత్రాల ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని తెలిపినారు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి ఎల్లవేళలా ఆరోగ్య రీత్య ఎదురయ్యే ఇవబందులను రాబోయే రోజులలో తగు చర్యలు తీసుకొని సంక్షేమం కోసం కృషి చేస్తారని తెలిపినారు. మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అశోక్ సిబ్బంది అనిల్, రహీం, నరేష్ షాకీర్, గాంధీ మరియు శంకర్లు పాల్గొన్నారు.