JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:36 pm Posted by : JANA SANGARSHANA

నిజామాబాద్ జిల్లా లో గుట్కాపై చీత ఫోర్స్ మెరుపు దాడి

 

 

నిజామాబాద్ జిల్లా లో గుట్కాపై చీత ఫోర్స్ మెరుపు దాడి

– అందజా 30 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం : పోలీస్ కమీషనర్ వెల్లడి

బోధన్;మే 09 జన సంఘర్షణ

శనివారం రోజున నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య,  ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ  ఆధ్వర్యంలో చీత ఫోర్స్ శనివారం రోజున బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆచన్‌పల్లి గ్రామంలో మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎచ్ కే జి ఎన్  షాప్ డంప్‌తో పాటు ఎచ్ కే జి ఎన్ మటన్ షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా సరుకుల అంచనా విలువ సుమారు రూ.30 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న గుట్కా సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించినట్లు తెలిపారు.