JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:48 pm Posted by : JANA SANGARSHANA

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

– పంట పై రసాయానాలను జాగ్రత్తగా వినియోగించాలి.

బోధన్:మే 16

ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో మోస్రా (గ్రామం & మండలం) లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎం సాయి చరణ్, కీటక శాస్త్రవేత్త, రైతులు పురుగు-తెగుళ్ల మందులను అవసరం మేరకు జాగ్రత్తగా పిచికారీ చేయాలని సూచించారు. వేపనూనె, అజాడిరక్తిన్ మందులను పంటలపై పురుగుల గుడ్ల సమూహలాను, తొలి దశ లార్వలను నివారణకు ఉపయోగించాలని, లింగాకార్షక బుట్టలను ఉపయోగించి పురుగుల ఉదృతిని గుర్తించి, సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు.పురుగులు ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు ఆఖరి అస్త్రం గా మాత్రమే రసాయన మందులు వినియోగించాలని సూచించారు.యూరియా సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలని, నానో యూరియా వాడకం పెంచాలని సూచించారు. బి. వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి, రైతులు ప్రభుత్వం సూచించిన, మార్కెట్ లో గిరాకి ఉన్న రకాలను సాగు చేయాలని, సేంద్రియ వ్యవసాయ విధానాల గురించి చర్చించారు. జి. భూపాల్ రెడ్డి, రైతులను ఉద్దేశించి పంట పొలాలను కాల్చవద్దని, యూరియా ని సిఫారసు మేరకు వినియోగించాలని సూచించారు. కే. లక్ష్మణ్, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్, రైతులు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థ నుండి కొనుగోలు చేయాలని, ఆధునిక విధానాలను ఉపయోగించి సాగు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మోస్రా వ్యవసాయ విస్తరణ అధికారి – బి. సప్తగిరి, గ్రామ ఉపసర్పంచ్ -సాయి సురేష్ గౌడ్, విడిసి చైర్మన్ – వి. పోతిరెడ్డి, సెక్రటరీ -నూలు సాయిలు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.