JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:53 pm Posted by : JANA SANGARSHANA

హత్యాయత్నం కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు శిక్ష

– పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పువెలువరించింది.

బోధన్ :మే 05 జన సంఘర్షణ

నిందితునికి శిక్ష పడే వరకు కృషి చేసిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ వివరాల్లోకి వెళితే జక్రాన్ పల్లి మండలానికి చెందిన మహిళకు 2023లో ప్రదీప్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ప్రదీప్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం భార్యను తరచూ వేధిస్తూ, కొట్టేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో 11-04-2025 రాత్రి, “ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావు” అని భార్య ప్రశ్నించగా, కోపోద్రిక్తుడైన భర్త ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో చీరతో మెడకు చుట్టి ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై బాధితురాలు జక్రానపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు అనంతరం కోర్టులో విచారణ జరగగా, నేరం రుజువైందని నిర్ధారించిన  న్యాయమూర్తి శ్రీ డి. దుర్గాప్రసాద్ ముద్దాయి ప్రదీప్‌కు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పు గృహ హింస, కట్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయవ్యవస్థ మరోసారి స్పష్టం చేసినట్లైంది.

ఈ కేసులో కృషిచేసిన మొదటి ఐ.ఓ సిహెచ్. తిరుపతి (ఎస్.ఐ) , రెండవ ఐ.ఓ ఎమ్. డి మాలిక్ రహమాన్ (ఎస్.ఐ ), బ్రీఫింగ్ చేసిన జి. మహేష్ ( ఎస్.ఐ ), టి. గోవింద్ ( ఎస్. ఐ కోర్టు లైయషన్ ఆఫీసర్ ) , వి. రామారావు ( కోర్టు డ్యూటీ ఆఫీసర్ ) మొదలగు వారిని నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్., అభినందించారు