బోధన్ మండలం ఊట్పల్లిలో మన ఊరు-మన భద్రత-మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు.
బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సీసీ కెమెరాల అవసరంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు గ్రామంలో ఈ వ్యాపార దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి మారకద్రవ్యాలు సేవించిన వారిని ఎలాగైనా మార్పించే రకంగా గ్రామస్తులు తోడ్పడాలని ఈ సందర్భంగా ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊటుపల్లి గ్రామ ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్, గ్రామ ప్రజలు, గ్రామ కార్యదర్శి, గ్రామప్రజలు పాల్గొని భద్రతా సూచనలను తెలుసుకున్నారు.