• బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా తొలి భేటీ
• ముందుండి నడిపించిన ప్రధాన కార్యదర్శి కుంజ సంతోష్
• ప్రజా సమస్యలపై పోరాటమే రోడ్‌మ్యాప్ – ఎస్టీ మోర్చా సమావేశంలో కుంజ సంతోష్ స్పష్టం
• గిరిజన ప్రాంతాల్లో పార్టీ విస్తరణే లక్ష్యం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా నూతన రాష్ట్ర పదాధికారుల తొలి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ సంతోష్ గారు ముఖ్య భూమిక పోషించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పదాధికారులందరినీ సమన్వయం చేస్తూ, సమావేశాన్ని ఆయన ముందుండి నడిపించారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో బీజేపీ జెండాను మరింత బలంగా ఎగురవేయడానికి, పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి కుంజ సంతోష్ గారు స్పష్టమైన ప్రణాళికను మరియు దిశానిర్దేశాన్ని పదాధికారుల ముందు ఉంచారు.
ముఖ్యంగా సంస్థాగత విస్తరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి గిరిజన తండా, గుడెంలోకి పార్టీని తీసుకెళ్లేలా క్షేత్రస్థాయి కమిటీల బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని కుంజ సంతోష్ పిలుపునిచ్చారు. గిరిజన హక్కుల పరిరక్షణలో బీజేపీ ఎస్టీ మోర్చా ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఈ సమావేశంలో పదాధికారులు చర్చించారు. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కుంజ సంతోష్ గారు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను నిర్దేశించారు. ఈ తొలి సమావేశం విజయవంతం కావడంలో ఆయన నాయకత్వం మరియు వ్యూహాత్మక చర్చలు అత్యంత కీలకంగా నిలిచాయి.
