ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం.
జన సంఘర్షణ: జున్ 02
ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. హెచ్. భరత్ 1,275 ర్యాంకు, జె. తన్విత 1,573 ర్యాంకు, బి.సంధ్య 1,627 ర్యాంకు, ఆర్.బన్నీ 1,834 ర్యాంకు, ఎ.అత్రిజ్ 2,361 ర్యాంకు సాధించారు.జాతీయ స్థాయిలో సత్తా
ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన IIT Advanced 2026 ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటారని తెలిపారు.
ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో బోధన
ఇంటర్మీడియట్లో అత్రుత పడితే జాతీయస్థాయి ఐఐటీ మెడికల్ పరీక్షలలో రాణించలేరని రామోజీరావు అన్నారు. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ ఉదయం రెగ్యులర్ సిలబస్తో పాటు మధ్యాహ్నం ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టును కాలేజీ ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉన్నతమైన ర్యాంకులు సాధించగలుగుతారని వివరించారు. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ స్థాయిలోనే తమ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలన్నారు.
విద్యార్థులకు అభినందన
వివిధ కేటగిరిలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కాకతీయ విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్ తేజశ్విని అభినందించారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విశేషమైన కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు, సిబ్బందికి ఛైర్పర్సన్ శ్రీమతి, సీహెచ్.విజయలక్ష్మి, డైరెక్టర్ సీహెచ్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ కళాశాలల ప్రిన్సిపాళ్లు సందీప్ కులకర్ణి, వి.రణధీశ్ శర్మ, అకాడమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ శ్యాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.