• తనకు న్యాయం చేయండి.. మహిళ భర్త సెల్ఫ్ వీడియోలో మొర
• బాన్సువాడ నియోజకవర్గంలో ఉమ్మడి మండలాల్లో షాడో ఎస్సై అంతా నా ఇష్టం లీడర్లు నా వెనుక ఉన్నారు…….
• నేను ఏం చెప్పితే అది నడుస్తది నేను ఏం చేస్తే అది తప్పు కాదు అదే కరెక్ట్ ఎస్సై స్టైల్ వేరు……
• మా లీడర్ ఎవరిపై చెప్తే వారిపై కేసులు చేస్తాం రౌడీ షీట్ చేస్తా అనే చందంగా మారింది ఆ షాడో ఎస్సై ది……..
• షాడో ఎస్సై ఆగడాలు చాలా ఉన్నాయి రాత్రి అయితే మద్యం మందు తాగి తందానే ఎస్సై…….
చట్టాన్ని కాపాడవలసిన ఓ పోలీస్ అధికారి, అదే పోలీస్ స్టేషన్లో కిందిస్థాయి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి, భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఏకంగా ఆ మహిళా భర్త సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తపరిచారు. బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఇటీవల బదిలీ అయిన ఎస్సై పై కిందిస్థాయి ఉద్యోగి తనకు నాన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయండి అంటూ ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నారు, లేకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్లో చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవ పడగా ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ,పోలీస్ స్టేషన్ కి భార్యాభర్తలు వెళ్ళగా,, ఆ ఉద్యోగి భార్యపై ఎస్సై కన్ను పడ్డది. ఇంకేముంది కిందిస్థాయి ఉద్యోగి అయిన ఆ వ్యక్తిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ స్థానికంగా విధులు ఇవ్వకుండా, దూర ప్రాంతాలకు విధులకు పంపిస్తూ తన భార్యతో వివాహతర సంబంధం సాగిస్తున్నాడని ఆయన కంటతడి పెట్టారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ ఎస్సై బాగోతం బయటపడింది. ఏకంగా ఒక భర్త, తన భార్యను ఎస్సై వివాహేతర సంబంధం సాగిస్తున్నారని ఆరోపించడం పోలీస్ శాఖలో కలకలం మొదలైంది.
ఈ అధికారి బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ చెడు బుద్ధులు ఆ ఎస్సై కి ఎటు పోతాయి అదే పద్ధతి ఇక్కడ కూడా కొనసాగించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా మెల్లగావలసి ఉండగా వారిపై కన్నేస్తున్నారు. తనకు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్ కు వెళ్తే తన భార్యపైనే కన్నేశాడని ఎస్సై పనితీరుపై మండిపడ్డారు. తనతో వెట్టి చాకిరి చేయించుకునేవాడని, బట్టలు ఉతకడం, రాత్రి తిన్న ఎంగిలి ప్లేట్లు కడగడం, కాళ్లు చేతులు మాలిష్ చేయడం లాంటి పనులు చేయించుకుంటూ మూడు నెలలు తనకు నరకం చూపించాడని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా ఆ ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలంటూ ఆ చిరుద్యోగి ఉన్నతాధికారులకు కోరుతున్నారు.