భూ కబ్జా.. తీవ్ర మనస్థాపానికి చెందిన యువరైతు
పోలీసు శీను సెల్ టవర్ ఎక్కి దూకుతానని ఆందోళన. భూ ఆక్రమణపై గ్రామస్తులనిరసన.
సెల్ టవర్ ఎక్కిన భూబాధితుడు పోలీసు శ్రీను
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో నిసంఘటన..!
కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారులు ఎంత నచ్చ చెప్పిన వినని యువరైతు.
కచ్చితంగా తన భూమిని ఇప్పిస్తాం అని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగివచ్చిన రైతు
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి:
జూన్ 15: (జన సంఘర్షణ):
తన భూమిని మరో రైతు తనదంటూ గత నెల రోజులుగా తవాదా జరగడం వల్ల గత 15 రోజులుగా రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రామాయంపేట ఎస్ ఐ బాలరాజు సోమవారం మెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామానికి వచ్చి అధికారులు, గ్రామ ప్రజల మధ్య భూ కబ్జా విషయంలోఇరు వర్గాలతో మాట్లాడుతానని చెప్పడం జరిగిందని బాధితులకు తెలిపాడు.అదేవిధంగా ఎస్సై పోలీస్ బలగాలతో వచ్చి భూ కబ్జా విషయాన్ని తెలుసుకోగా కొద్దిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో భూ బాధితుడు శ్రీను మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా తాను తన భూమిని చదును చేస్తూ పొలం నాటు వేయడం జరుగుతుందని తెలిపాడు. అయినప్పటికీ ఎదుటివారు వినకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన యువ రైతు అక్కన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉన్న సెల్ టవర్ ను ఎక్కి పైనుండి దూకుతానని ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వెంటనే సెల్ టవర్ పైనుండి దిగిరావాలని ఎంత బతిమాలాడినా తనకు న్యాయం జరిగే వరకూ దిగనని సుమారు నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం మధ్య భూవివేదం కొనసాగింది. చివరగా రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి, ఎస్ ఐ బాలరాజు, గ్రామ పెద్దలు కల్పించుకొని భూమి విషయంలో అన్ని సర్వే చేసి మీ భూమి నీకు అందే విధంగా చూస్తానని చెప్పడంతో ఆయన సెల్ టవర్ దిగి రావడం జరిగింది. దీంతో తీవ్ర ఉత్యుత్తత మధ్య భూగ్యవాదం విషయం లో అందరూ ఊపిరిపించుకున్నారు. కుటుంబ సభ్యులు బోరుణ విలపించడం వల్ల ఆయన కూడా సెల్ టవర్ ది కుటుంబ సభ్యులతో భోరమన్నాడు. తనకు న్యాయం చేయకుంటే తాను ఊరుకోనని అధికారులకు తేల్చి చెప్పాడు. వెంటనే భూ పరిష్కారం చేస్తామని అధికారులు గ్రామ పెద్దల మధ్య హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. తీవ్ర మనస్థాపానికిమెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ శ్రీను (38) తన భూమి ఆక్రమణకు గురైందని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. 4 గంటలపాటు టవర్ పైనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. తహసిల్దార్ రజనీకుమారి సర్వే చేసి న్యాయం చేస్తానని మాట ఇవ్వడంతో శ్రీను కిందికి దిగాడు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సదర్ రైతు ఓ చెరువు లోని ఐదు ఎకరాల గుంటను ఆక్రమించుకొని పొలం సాగు చేస్తూ,చెరువులో కూరగాయలకు సైతం పండిస్తున్నట్లు గ్రామస్తులు కొందరు తెలిపారు.ఆయనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ రజనీకుమారికి బాధితుడు శ్రీను, ప్రజలు కోరారు.